ప్రియుడితో బ్రేకప్?.. అందుకే పాయల్ ఇలా మాట్లాడుతోందా

January 5, 2024

ప్రియుడితో బ్రేకప్?.. అందుకే పాయల్ ఇలా మాట్లాడుతోందా

ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈమె ఇటీవల మంగళవారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే పాయల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసినటువంటి వారందరూ కూడా కొంపదీసి మీకు బ్రేకప్ అయ్యిందా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈమె ఎలాంటి పోస్ట్ చేశారు ఏంటి అనే విషయానికి వస్తే..

మీరు మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ విషయంలో తప్పకుండా రియలైజ్ అవుతారు. హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లేదా మీరు ఉన్నటువంటి రిలేషన్ లేకపోతే మీ చదువు కారణంగా రాదు. ఇక మీ జీవితంలోకి ఎవరైనా వచ్చినా కూడా వారి వల్ల ఎప్పుడు సంతోషం అనేది రాదు అని ఈమె తెలిపారు. ఆనందం అనేది మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడే నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు ఆనందం అనేది ఎప్పుడూ కూడా ఇతరులలో ఉండదని ఆనందం ఎప్పటికీ మీతోనే ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేశారు.

ఈ విధంగా పాయల్ మన సంతోషం ఎవరి దగ్గర ఉండదని అది ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఈ పోస్ట్ చేయడంతో ఏంటి ఎవరినైనా నమ్మి మోసపోయావా లవ్ లో బ్రేకప్ జరిగిందా అంటూ ఎంతోమంది ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె నిజంగానే ప్రియుడుతో బ్రేకప్ చెప్పుకొని ఇలాంటి పోస్ట్ చేశారా లేకపోతే సాధారణంగానే ఈ విషయాన్ని చెప్పారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read More: సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగిన హీరోయిన్స్.. హిట్ కొట్టేదెవరో?

ట్రెండింగ్ వార్తలు