బాధల్లోంచి బయటపడేందుకు ఆ పని చేస్తున్న పాయల్.. వీడియో వైరల్!

January 9, 2024

బాధల్లోంచి బయటపడేందుకు ఆ పని చేస్తున్న పాయల్.. వీడియో వైరల్!

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నటి పాయల్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి కానీ ఈ సినిమా స్థాయిలో తనకు ఏ సినిమా కూడా సరైన హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమెకు మాత్రం హిట్ అందలేదని చెప్పాలి అయితే మరోసారి అజయ్ భూపతి డైరెక్షన్లో ఈమె మంగళవారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా హిట్ అనంతరం ఈమె తిరిగి మరి కొన్ని సినిమాల కథలను వినేపనిలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి పాయల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవలే తన పెట్ డాగ్ చనిపోయింది అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నటువంటి ఈమె తాజాగా యోగాకు సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గత కొద్దిరోజులుగా తనని వెంటాడుతున్నటువంటి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసమే తాను ఇలా యోగ చేస్తున్నాను అంటూ ఈమె చెప్పుకువచ్చారు.

ఇలా కొద్దిరోజులుగా తనని వెంటాడుతున్నటువంటి ఈ బాధల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఈమె భారీగా యోగా చేస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో తలక్రిందులుగా వేలాడుతూ అలాగే యోగాకి సంబంధించినటువంటి కొన్ని ఆసనాలను వేస్తూ ఈ బాధ నుంచి బయట పడాలని ప్రయత్నాలు చేసారు. అయితే ఇలాంటి యోగాసనం చేసిన తర్వాత తన మనసు కాస్త ప్రశాంతత పొందింది అంటూ ఈ సందర్భంగా పాయల్ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Read More: ఇవేం డ్రెస్సురా భై.. అంతా కనిపిస్తూనే ఉందిగా.. ఉర్ఫీ అసలు బట్టలేసుకుందా?

ట్రెండింగ్ వార్తలు