సలార్ చూసే వారికి ఇదో సూచన.. ఈ సీన్లు మాత్రం మిస్ అవ్వకండి

December 22, 2023

సలార్ చూసే వారికి ఇదో సూచన.. ఈ సీన్లు మాత్రం మిస్ అవ్వకండి

Salaar Movie Scene: సలార్(Salaar) సినిమాలో ఎలివేషన్లకు ఏ మాత్రం కొదవ ఉండదు. ప్రశాంత్ నీల్‌కు మాస్ ఆడియెన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలో తెలుసు. ఎలా చూపిస్తే హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారో ఆయనకు బాగానే తెలుసు. అందుకే ప్రభాస్(Prabhas) సలార్ మీద అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కేజీయప్ చాప్టర్ 1, చాప్టర్ 2లు చూసిన తరువాత హీరో ఎలివేషన్ షాట్స్ మీద ఓ మార్క్ ఏర్పడింది. ఆ రేంజ్‌లో మరేతర దర్శకుడు కూడా చూపించలేరని అంతా ఫిక్స్ అయ్యారు.

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తన మార్క్‌ను ప్రభాస్ కట్ అవుట్ మీద చూపించాడు. ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే ఫ్యాన్స్ థియేటర్లో పిచ్చెక్కిపోవాల్సిందే. ప్రశాంత్ నీల్ కనిపిస్తే గుడి కట్టేస్తారు. అంతలా ఎలివేట్ చేశాడు. హీరోయిన్‌ను ఏడిపిస్తుంటే.. తల్లి మాటకు కట్టుబడి గొడవలకు దిగని కొడుకు తన కోపాన్ని గుండెలోనే దిగ మింగుకుంటాడు.లోపలే అగ్ని పర్వతాన్ని పెట్టుకుని ఉన్నట్టుగా ఉండే హీరో తన చేతిని ఇనుప రాడ్డు మీద వేస్తాడు. ఎంత ఉడికిపోతోన్నా కూడా గొడవకు దిగడు. చివరకు ఆ చేతి అచ్చులు ఆ ఇనుప కడ్డీ మీద పడిపోతాయి. అదొక్క సీన్ చాలు అనుకునే లోపే ఇంకో సీన్ పెట్టేశాడు.

బొగ్గు క్వారిలో హీరోయిన్‌ను రౌడీలు పట్టుకెళ్తుంటారు.కానీ హీరో ఏం చేయలేక అలా చూస్తుండిపోతాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం గొడవలకు దూరంగా ఉంటాడు. ఇక హీరోయిన్‌ను తీసుకెళ్లి వ్యాన్‌లో కూర్చోబెడతారు. వ్యాన్ డ్రైవర్ యాక్సిలేటర్ పెంచుతుంటాడు. కానీ బండి ముందుకు వెళ్లదు. స్టార్ట్ కాదు. ఇక అదే టైంలో యాక్సిలేటర్ ఎంతగా పెరిగితే..మన హీరో ఆవేశం అంతలా పెరుగుతుంది. చేతి నరాలు పైకి వస్తాయి. పిడికిలి బిగిస్తుంటాడు. వదలుతుంటాడు. కట్టలు తెంచుకునే ఆవేశాన్ని చేతి అంచునే ఆపేస్తుంటాడు. లావా బద్దలయ్యే ముందు ఎంతగా లోలోపల ఉడికిపోతుందో అలా మన హీరో తన కోపాన్ని అణుచుకుంటాడు. ఆ సీన్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టిన డబ్బులకు ఫుల్ హ్యాపీ అవ్వాల్సిందే. ఆ తరువాత వచ్చే ఫైటింగ్ సీన్, ఇంటర్వెల్ ఫైట్ సీన్ అదుర్స్ అంతే.

ఇలాంటి ఎలివేషన్ సీన్లు సెకండాఫ్‌లో బోలెడుంటాయి. హీరో చేతులు కట్టుకుని నిల్చునే సీన్, మహారా ఏరియాలో ఉండే ఫైటింగ్ సీన్ ఇలా చాలా సీన్లు ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ లుక్కేయాల్సిందే అన్నట్టుగా ఉంటాయి. ఇది పూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్, మాస్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే సీన్లతో నిండిన సినిమా.

Read More: థియేటర్లో సలార్ నిలిపివేత.. డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ?

ట్రెండింగ్ వార్తలు