August 28, 2022
‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి రెండు వరుస ఫ్లాప్‌లు వచ్చిన ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ సినిమా నుండి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ ఫిల్మ్ గా వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ‘రాముడి’పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
కాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అందలేదు. దాంతో పలుమార్లు ‘అప్డేట్ ప్లీజ్’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు సైతం పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులను ఫుల్ ఖుషీ చేసేందుకు ‘ఆదిపురుష్’ టీం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ చివరికల్లా ఈ అప్డేట్ మాత్రం తప్పకుండా వస్తుందని సినీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ తొలిసారిగా డైరెక్ట్ హిందీ ఫిల్మ్ లో నటిస్తుండటం పట్ల అభిమానులు, తెలుగు ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆదిపురుష్’లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023 జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.