September 28, 2021
లైగర్ సెట్లో గ్రాండ్‌గా పూరిజగన్నాధ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లైగర్
. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైగర్ సెట్లో పూరిజగన్నాధ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేశారు పూరి జగన్నాధ్.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
లైగర్ చిత్రం ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమవున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిన ఐరన్ మైక్ పాత్రలో ఆయన కనిపించనున్నారు.
బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందుతోంది.