తమ కలలను పక్కన పెట్టి స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు వీళ్ళే..ఏం చేశారో తెలుసా?

April 26, 2024

తమ కలలను పక్కన పెట్టి స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు వీళ్ళే..ఏం చేశారో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగడం అంటే చాలా కష్టతరమైన పని అని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోయిన్లు సక్సెస్ అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారే తప్ప ఎక్కువ కాలం పాటు వీరికి మనకు కూడా ఉండదని చెప్పాలి. కానీ ఆ కొద్ది రోజులు ఇండస్ట్రీని ఏలడం కోసం కొంతమంది సెలబ్రిటీలు ఎన్నో త్యాగాలు చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సెలబ్రిటీలు అందరూ కూడా వారు అనుకున్నటువంటి లక్ష్యాలను త్యాగం చేసి మరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారట.

ఈ విధంగా వారి లక్ష్యాలను పక్కనపెట్టి సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నటువంటి ఆ హీరోయిన్లు ఎవరు వారు ఏ లక్ష్యాన్ని పక్కన పెట్టారనే విషయానికి వస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత(Samantha ) ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్ గా అడుగు పెట్టాలని అనుకున్నారట కానీ తనకు సినిమా అవకాశాలు రావడంతో తన లక్ష్యాన్ని పక్కనపెట్టారు.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతిసింగ్ (Rakul Preeth Singh) అయితే ఈమెకు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రాకముందు మంచి బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు పొందాలని భావించారట కానీ ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రకుల్ ప్రస్తుతం పలు బిజినెస్లను ప్రారంభించి తన కోరికను నెరవేర్చుకున్నారు ఈమె ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభించడమే కాకుండా రెస్టారెంట్లకు కూడా ప్రారంభించారు.

రష్మిక(Rashmika ) నేషనల్ క్రష్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఎయిర్ హోస్టర్స్ కావాలని అనుకున్నారట కానీ ఈమె చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడం తన కలను పక్కనపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇక కియారా అద్వానీ సైతం పైలెట్ కావాలని కోరుకున్నాడట అయితే ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో తన కోరిక అలాగే మిగిలిపోయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీగా కొనసాగుతూ ఇటీవల పెళ్లి చేసుకుని జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక నటి సాయి పల్లవి సైతం హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి రావాలని ఏమాత్రం కోరుకోలేదు ఈమె డాక్టర్ వృత్తిలో స్థిరపడాలని భావించారు. అయితే సినిమా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఎప్పటికైనా తన వృత్తిలో స్థిరపడతారని తెలుస్తోంది.

Read More: ఉపాసన, ప్రణతి, బ్రాహ్మణి.. ఆ విషయంలో ముగ్గురు ముగ్గురే..ఎవరు సాటి రారుగా?

ట్రెండింగ్ వార్తలు