March 9, 2022
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో ‘గోపికృష్ణా మూవీస్’ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థల పై వంశీ, ప్రమోద్, ప్రసీద లు కలిసి నిర్మించిన పీరియాడిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘రాధే శ్యామ్'(Radheshyam) మార్చి 11న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా Radheshyam కావడంతో సినిమాకి భారీ క్రేజ్ నమోదైంది. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం: 36.8 కోట్లు ఉత్తరాంధ్ర: 13.2 కోట్లు సీడెడ్: 18 కోట్లు ఈస్ట్: 8.8 కోట్లు వెస్ట్: 7.7 కోట్లు కృష్ణా: 8.2 కోట్లు గుంటూరు: 9.9 కోట్లు నెల్లూరు: 4.4 కోట్లు
మొత్తం ఏపీ + తెలంగాణ : 107 కోట్లు
కర్ణాటక: 12 కోట్లు తమిళనాడు: 6 కోట్లు కేరళ: 2 కోట్లు
హిందీ: 42 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 10 కోట్లు ఓవర్సీస్: 24 కోట్లు ప్రమోషన్స్ అండ్ పబ్లిసిటీ : 5 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 210 కోట్లు
అదండీ… ‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.210 కోట్ల బిజినెస్ జరిగింది. అంత మొత్తాన్ని రికవరీ చేస్తే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. అది ఈజీ టార్గెట్ అయితే కాదు. ‘సాహో’ కి ‘బాహుబలి’ క్రేజ్ కలిసి రావడంతో ఓపెనింగ్స్ భారీగా నమోదయ్యాయి. దాంతో ‘సాహో’ రిలీజ్ కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 60శాతం రికవరీ అయిపోయింది. ఫుల్ రన్లో ఆ మూవీ రూ.215 కోట్ల షేర్ ను నమోదుచేసింది. ‘సాహో’ క్లోజింగ్ కలెక్షన్లను రాబడితే ‘రాధేశ్యామ్’ బ్రేక్ ఈవెన్ అయినట్టే.. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి..!
Read More: Prabhas: ‘రాధేశ్యామ్’ ప్రాజెక్టు కృష్ణంరాజు డైరెక్ట్ చేయాల్సిందేనట..!