రకుల్ మోకాలికి గాయం..అదేనా మ్యాటర్..నెటిజన్ల దారుణమైన ట్రోలింగ్?

December 24, 2023

రకుల్ మోకాలికి గాయం..అదేనా మ్యాటర్..నెటిజన్ల దారుణమైన ట్రోలింగ్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) గురించి మనందరికీ తెలిసిందే. ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. అయితే మొన్నటి వరకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా తెలుగులో రకుల్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సందీప్ కిషన్, రామ్ పోతినేని, నాగ చైతన్యలాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) సినిమాలలో బిజీ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోలను షేర్ చేస్తూ ఉండే రకుల్ తాజాగా కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని అందాలను ఆరాబోస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.

అయితే ఆ ఫోటోస్ లో రకుల్ మోకాలికి దెబ్బ తగలగ ప్లాస్టర్ అతికించింది. అయితే రకుల్ కి గాయం అవ్వడంతో కొందరు ఏమి అయ్యింది అని అడుగుతుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి రకుల్ షేర్ చేసిన ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read Moreమళ్లీ మొదలు పెట్టిన సమంత..ఇక త్వరలోనే శుభవార్త!

ట్రెండింగ్ వార్తలు