గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భర్త్డే గిఫ్ట్.. ఆ రోజే అనౌన్స్ చేయబోతున్న ఆర్ సి17 సినిమా ముచ్చట్లు!

March 22, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భర్త్డే గిఫ్ట్.. ఆ రోజే అనౌన్స్ చేయబోతున్న ఆర్ సి17 సినిమా ముచ్చట్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇదే విషయంపై డైరెక్టర్ శంకర్ మీద, ప్రొడ్యూసర్ దిల్ రాజు మీద ఫైర్ అవుతున్నారు చరణ్ ఫ్యాన్స్. ఇలాంటి సమయంలోనే గ్లోబల్ స్టార్ తన సినిమాలు విషయంలో గేర్ మార్చినట్లు కనిపిస్తుంది.

వెంట వెంటనే సినిమాలకి కమిట్ అవుతున్నారు మన రామ్ చరణ్. సుకుమార్ శిష్యుడు, ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. హీరోయిన్ గా జాన్వీ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమా పనిచేస్తూ ఉండటంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది.

ఇంతలోనే రామ్ చరణ్ మరొక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. రంగస్థలం లాంటి నాన్ బాహుబలి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో జతకట్టబోతున్నాడు రామ్ చరణ్. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తారంట. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కపోతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు సుకుమార్ కూడా ప్యాన్ ఇండియా డైరెక్టర్ కావడం, రాంచరణ్ గ్లోబల్ స్టార్ కావటం వలన వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాని కూడా భారీగానే ఆశిస్తారు ప్రేక్షకులు. అందుకు తగినట్టుగానే ఈ సినిమాకి 250 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారు అంట మూవీ మేకర్స్. ప్రస్తుతం పుష్ప టు మేకింగ్ లో ఉన్న సుకుమార్ ఆగస్టు నుంచి ఫ్రీ అవుతారంట. ఆ తర్వాత రంగస్థలం కాంబినేషన్లో మొదలగుబోయే ఆర్ సి 17 మూవీ పనులు ప్రారంభిస్తారంట. చరణ్ తరపున ఫ్యాన్స్ కి ఇది బర్త్డే గిఫ్ట్ అంటున్నారు నెటిజన్స్.

Read More: Om Bheem Bush Movie Review: ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.

ట్రెండింగ్ వార్తలు