సలార్ టీం భయపడిందా?.. కలెక్షన్ల మాటే ఎత్తడం లేదే

December 31, 2023

సలార్ టీం భయపడిందా?.. కలెక్షన్ల మాటే ఎత్తడం లేదే

Salaar Collections: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. సలార్ సినిమా అన్ని భాషలలోనూ మంచి విజయాన్ని చేసుకుంటున్న సంగతి తెలిసింది. ఇక ఈ సినిమా మొదటి మూడు రోజులలోనే 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అయితే ఈ సినిమా విడుదలయి దాదాపు వారం రోజులు పూర్తయినప్పటికీ మేకర్స్ ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారు.

ఇప్పటివరకు నిర్మాణ సంస్థ నుంచి ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్స్ మాత్రం విడుదల కాలేదు ఇలా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నిర్మాతలు మౌనంగా ఉండటానికి కారణం ఏంటి బహుశా ఈ సినిమా కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాలేదా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగా ఉంటుందా? ఆ విషయంలో సలార్ టీమ్ భయపడిందా? అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి మూడు రోజులలోనే 400 కోట్ల రాబట్టినటువంటి ఈ సినిమా ఇప్పటివరకు ఎంత మేరా కలెక్షన్స్(Salaar Collections)రాబట్టిందనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే వారి ఫ్యాన్ పేజీ ద్వారా ఫేక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ హోంబలే వారు మాత్రం ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి పోస్టర్స్ విడుదల చేయలేదు. అయితే ఈ వీక్ ఈ సినిమా కలెక్షన్స్ కాస్త పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూడు రోజులలో భారీ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తాయి అంటూ పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల రాబట్టింది బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరింత రాబట్టాలి అనే విషయాలు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప క్లారిటీ ఉండదని చెప్పాలి.

Read More: కాంగ్రెస్ పార్టీలోకి దిల్ రాజు..ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ?

ట్రెండింగ్ వార్తలు