August 23, 2022
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. టాలీవుడ్‌లోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలలో నటించారు. వీరిద్దరు కూడా ఎక్కడా రిస్కీ సీన్స్ లో కూడా కంప్రమైజ్ అవ్వకుండా క్యారెక్టర్స్ కి ప్రాణం పోసి, నటనతో ఆద్యంతం ప్రేక్షకులను మెప్పించారు. దానికి ప్రతిఫలంగా ఈ సినిమా రూ.1200 కోట్లకుపైగా వసూళు చేసింది. దీంతో పాటు అటు ప్రేక్షకుల నుండి, ఇటు హాలీవుడ్ ప్రముఖుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది.
ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ అద్భుతంగా నటించినప్పటికీ, ఇటీవల కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా.. ఎన్టీఆర్ ని మాత్రమే కలిసి అభినందించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి చరణ్ ని కాకుండా ఎన్టీఆర్ ని మాత్రమే అమిత్ షా ఎందుకు కలిశాడు? అనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే అమిత్ షా.. ఎన్టీఆర్ ని మాత్రమే కలవడంపై రాజకీయ ప్రణాళికలు దాగి ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. మరి అమిత్ షా.. ఎన్టీఆర్ ని మాత్రమే కలవడంపై వినిపిస్తున్న కారణం ఏంటంటే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి.. మెగా ఫ్యాన్స్ అంతా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అదే ఎన్టీఆర్ అయితే బీజేపీకి ఎక్ట్రా ఎలిమెంట్ అవుతుందని.. అదేవిధంగా ఎన్టీఆర్ ద్వారా నందమూరి అభిమానుల సపోర్ట్ కూడా బీజేపీకి రాబట్టుకోవాలనే ఉద్దేశంతో అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.