హైద‌రాబాద్‌లో ఆర్ఆర్ఆర్‌ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌…ఎప్పుడంటే?

December 23, 2021

హైద‌రాబాద్‌లో ఆర్ఆర్ఆర్‌ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌…ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘RRR’ నిస్సందేహంగా ఒకటి. కొమ‌రం భీమ్‌గా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌ట విశ్వ‌రూపం ట్రైల‌ర్‌లోనే చూపించారు. ఈ ట్రైల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేష స్పంద‌న రాబ‌ట్టుకుంది. తారక్‌కు జోడిగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రేయ, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఇటీవల ముంబైలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. కరణ్ జోహర్ హోస్ట్ చేసిన ఈ మెగా ఈవెంట్‌కి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విడుద‌ల‌కి ఇంకా కొన్ని రోజులే ఉండ‌డంతో తెలుగు ప్రేక్షకుల కోసం హైద‌రాబాద్‌లో మ‌రింత‌ పెద్ద ఈవెంట్‌ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి హాజ‌రుకానున్నారు. సాధార‌ణంగా రాజమౌళి తన సినిమా ఈవెంట్‌ల విషయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన ప్లాన్స్‌తో ఉంటారు. RRRలో మెగా, నందమూరి కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. దీంతో అభిమానులకు ఉత్సాహపరిచేందుకు ఆ కుటుంబాలకు చెందిన సీనియర్ హీరోలనే పిలవాలనుకుంటున్నార‌ట‌. ఈ ఈవెంట్లో ఎన్నో స‌ర్ప్రైజ్‌ల‌ను కూడా ప్లాన్ చేశార‌ట రాజ‌మౌళి. త్వ‌ర‌లో ఈ భారీ ఈవెంట్‌కు సంబందించిన వివ‌రాలు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి తెలుప‌నున్నారు రాజ‌మౌళి. దాదాపుగా జ‌న‌వ‌రి 2 లేదా 3న ఈ ఈవెంట్ ఉండే అవ‌కాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు