నైజాంలో 100 కోట్లు కొల్లగొట్టిన సలార్!

January 5, 2024

నైజాంలో 100 కోట్లు కొల్లగొట్టిన సలార్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే బాహుబలి సినిమా తర్వాత మరో మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఏ సినిమా కూడా ఈ స్థాయిలో సక్సెస్ కాలేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు అదే స్థాయిలో మంచి ఆదరణ లభించింది.

ఈ సినిమాకు కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకొని నైజం ఏరియాలో ఈ సినిమాని విడుదల చేశారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలైనటువంటి రెండు వారాలలో నైజాం ఏరియాలో ఎంత మేర కలెక్షన్స్ రాబట్టిందనే విషయాలను మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా రెండు వారాలలో నైజం ఏరియాలో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇలా ఈ ఏరియాలో 100 కోట్లు రాబట్టడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పార్ట్ వన్ మంచి సక్సెస్ కావడంతో పార్ట్ 2 పై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందని ఇటీవల నిర్మాత విజయ్ కిరంగదూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. సలార్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ నటిస్తున్నటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి, అలాగే స్పిరిట్ సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ఒక హర్రర్ సినిమా కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.

Read More: శ్రీకాంత్ కూతురి అందం ముందు హీరోయిన్స్ కూడా వేస్టే?

ట్రెండింగ్ వార్తలు