Salaar First Ticket: స‌లార్ ఫ‌స్ట్ టికెట్ కొన్న రాజ‌మౌళి..ధ‌ర ఎంతో తెలుసా?

December 16, 2023

Salaar First Ticket: స‌లార్ ఫ‌స్ట్ టికెట్ కొన్న రాజ‌మౌళి..ధ‌ర ఎంతో తెలుసా?

Salaar First Ticket: విడుద‌ల‌కి ఇంకా ఆరు రోజులే ఉండ‌డంతో సలార్ సందడి షురూ అయ్యింది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్(Prabhas) హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మ‌క చిత్రం స‌లార్‌ ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‏, సాంగ్స్‌తో హైప్ పెంచేసిన చిత్ర యూనిట్‌..ఇప్పుడు ఆ హైప్‌ని మ‌రింత పెంచ‌డానికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ ఇంట‌ర్వ్యూ రికార్డ్ చేశారు. అతి త్వ‌ర‌లో మీడియాకు ఇవ్వ‌నున్నారు.

ఈ ఇంట‌ర్వ్యూ త‌ర్వాత స‌లార్ ఫ‌స్ట్ టికెట్ ను(Salaar First Ticket) ఎస్ ఎస్ రాజమౌళి కొన్నారు. ఆ టికెట్ ధర సుమారు రూ.10,116 ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

సలార్ చిత్రయూనిట్ ఎస్ఎస్ రాజమౌళికి టికెట్ ను అందిస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఉదయం 7 గంటలకు తెల్లవారుజామునే ఫస్ట్ షో బుక్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. టికెట్టు ప్రకారం ఆయన RTC ‘X’ రోడ్స్‌లోని సంధ్య 70MM థియేటర్‌లో చూస్తారు. ఇక ఇప్పటికే కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సెషన్ సృష్టించాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ తోపాటు.. అటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన డంకీ చిత్రం సైతం విడుదల కాబోతుంది. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద షారుఖ్, ప్రభాస్(Prabhas) మధ్య గట్టిపోటి జరగనుంది. అందుకే సలార్ ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఏ చిన్న అప్డేట్.. ప్రయత్నం వదిలిపెట్టడం లేదు.

మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ ను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరూ శత్రువులుగా ఎలా మారారు అన్నదే సలార్ స్టోరీ లైన్ అని గతంలోనే వెల్లడించారు డైరెక్టర్ నీల్. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది.

Read More: ShahRukhKhan-AbRamKhan: షారుఖ్ పుత్రోత్సాహం.. అబ్‏రామ్ వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు