బుద్ధి బయటపెట్టిన తమిళ ప్రేక్షకులు.. సలార్‌పై అంత అక్కసు దేనికి?

December 29, 2023

బుద్ధి బయటపెట్టిన తమిళ ప్రేక్షకులు.. సలార్‌పై అంత అక్కసు దేనికి?

Salaar: ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా హిందీ తమిళం మలయాళం సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ విడుదలైన సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో అలా చాలా సినిమాలు తెలుగులోకి విడుదల అయ్యి మంచి ఆదరణను దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఉదాహరణకు కాంతార, పొన్నియిన్ సెల్వన్ 2 లాంటి సినిమాలు విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించాయో మనందరికీ తెలిసిందే. అలా తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను కూడా బాగా ఆదరించారు. కానీ తాజాగా విడుదలైన సలార్(Salaar) సినిమా విషయంలో తమిళ ప్రేక్షకులు వారి బుద్ధిని బయటపెట్టారు. అందుకు ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలవుతున్న ట్వీట్ అని చెప్పవచ్చు. తమిళ సినిమా అయినా పిఎస్2 సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా బాగా ఆదరణను దక్కించుకుంది. పిఎస్ 2 సినిమా తెలుగులో దాదాపుగా 5 మిలియన్ డాలర్స్ ను దక్కించుకుంది. కానీ సలార్ కి లక్ష డాలర్స్ కూడా రాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు తమిళ ప్రేక్షకులపై మండి పడుతున్నారు. సలార్‌పై అంత అక్కసు దేనికి అని మండి పడుతున్నారు. తమిళ ప్రేక్షకులు బుద్ధి బయట పెడుతున్నారు అంటూ మండి పడుతున్నారు.

Read More: గుంటూరు కారం లీక్స్.. పూసగుచ్చినట్టు వివరించాడే.. ట్విస్టులన్నీ చెప్పేశాడు

ట్రెండింగ్ వార్తలు