సమంత ఈజ్ బ్యాక్ రెమ్యూనరేషన్ డబుల్ చేసిన సామ్…ఏకంగా అన్ని కోట్లా?

March 19, 2024

సమంత ఈజ్ బ్యాక్ రెమ్యూనరేషన్ డబుల్ చేసిన సామ్…ఏకంగా అన్ని కోట్లా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం మయూసైటిసిస్ వ్యాధికి గురి కావడంతో ఈమె కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోరుకున్నారని, త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలోకి రాబోతున్నటువంటి తరుణంలో ఈమెకు కొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి ప్రస్తుతం కథలు వినే పనిలో సమంత బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో నటించిన సీటాడెల్ తెలుగు వర్షన్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోయినా ఈమె మాత్రం ఈ సిరీస్ కోసం పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇక ప్రస్తుతం కథలను వింటున్నటువంటి సమంత కొత్త ప్రాజెక్టులను చేయడానికి కూడా భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటివరకు కేవలం నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి సమంతా ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 6 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన ఈమె ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇలా సినిమాలకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే సమంత ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం సుమారు 1.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా సమంత రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసి నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఈమె చివరిగా నటుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Read More: కారు ప్రమాదంపై స్పందించిన మంగ్లీ.. పుకార్లను నమ్మొద్దు అంటూ పోస్ట్!

ట్రెండింగ్ వార్తలు