అర్జున్ రెడ్డి అల్లు అర్జున్ తో చేయాల్సి ఉండేదా.. చేసి ఉంటే మరోలా ఉండేదే?

January 6, 2024

అర్జున్ రెడ్డి అల్లు అర్జున్ తో చేయాల్సి ఉండేదా.. చేసి ఉంటే మరోలా ఉండేదే?

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా నటుడు విజయ్ దేవరకొండ అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇద్దరు కూడా స్టార్ డమ్ పొందారు. ఇక ఇదే సినిమాని డైరెక్టర్ హిందీలో కబీర్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అక్కడ కూడా ఎంతో మంచి విజయం అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి ప్రభాస్ తో చేయబోతున్నటువంటి స్పిరిట్ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. యానిమల్ సినిమా విజయవంతం అయినటువంటి సందర్భంలో సందీప్ రెడ్డి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూ లో ఈయన అర్జున్ రెడ్డి సినిమా గురించి కామెంట్ చేశారు.

అర్జున్ రెడ్డి సినిమా కథ ప్రిపేర్ చేసిన తర్వాత ఎంతోమంది దర్శకులను నిర్మాతలను కలిశాను ఎవరూ కూడా సినిమాకు ఓకే చేయలేదు దాంతో నేనే డైరెక్టర్ గాను నిర్మాతగాను మారిపోయానని తెలిపారు. ఇక ఈ సినిమా ఏ హీరోతో చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అల్లు అర్జున్ పేరు గుర్తుకు వచ్చిందని దీంతో ఆయనకు కథ చెప్పాలని ప్రయత్నాలు చేశాను కానీ తనని కలిసే అవకాశం కూడా నాకు రాలేదని సందీప్ రెడ్డి తెలిపారు.

ఇలా అల్లు అర్జున్ ని కలిసే అవకాశం రాకపోవడంతో తన స్నేహితుడి ద్వారా తనకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యారు. ఇలా విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేశామని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. ఇదే సినిమా కనుక అల్లు అర్జున్ తో చేసి ఉంటే మరో రేంజ్ లో ఉండేదని ప్రస్తుతం పలువురు సందీప్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒకప్పుడు అల్లు అర్జున్ కలవడానికి కూడా నాకు అవకాశం లేదు కానీ ఇప్పుడు ఆయనతో సినిమానే చేసే అవకాశం వచ్చిందని దేనికైనా సమయం రావాలి అంటూ ఈయన వెల్లడించారు.

Read More: ఫుడ్ పాయిజన్ అవడంతో ఇలా మారిపోయా.. రాజీవ్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు