నాని `స‌రిపోదా శ‌నివారం`కి రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్‌

January 20, 2024

నాని `స‌రిపోదా శ‌నివారం`కి రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్‌

హాయ్ నాన్న సక్సెస్‌తో ఫుల్ జోష్‌ మీదున్నాడు నాని. ఇక తన ఫోకస్‌ అంతా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ‘సరిపోదా శనివారం’ మీద పెట్టాడు. నాని 31వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్‍రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో రికార్డు సాధించింది.. కేవ‌లం ఆంధ్రా, సీడెడ్‌, నైజాం రైట్స్ క‌లిపి 25 కోట్ల‌కు పైగా అమ్ముడు పోయాయి. నానికి ఇది రికార్డు ధ‌ర అనే చెప్పాలి. ఇక నాన్ ధియేట్రిక‌ల్ ప‌రంగా ఓవర్సీస్, ఇతర బాషల డబ్బింగ్ హక్కులు, ఓటిటి రైట్స్, శాటిలైట్ వీటి నుంచి భారీగానే రాబ‌డి ఉంటుంది. ఎలా చూసుకున్నా ఈ సినిమా నిర్మాత‌లు రిలీజ్‌కి ముందే దాదాపు 25కోట్లకు పైగానే లాభాన్నిపొందే అవ‌కాశం ఉంది. దసరా, హాయ్ నాన్నా వరస సూపర్ హిట్లతో ఒక్కసారిగా నాని మార్కెట్ పెరిగిపోయింది.

నిన్నటి నుంచి ఎస్జె సూర్య సెట్లో అడుగు పెట్టాడ‌ని తెలుస్తోంది. విలన్ గా చాలా వైవిధ్యమైన పాత్రను డిజైన్ చేశారట.. తనకు నానికి మధ్య ఉండే కాంఫ్లిక్ట్ పాయింట్ ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయలేదని అంటున్నారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా లేదా దీపావళి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Read More: #90’s’ నా కెరీర్ లో మెమరబుల్ గా నిలిచిపోతుంది‍ – ‍‍‍‍‍‍‍‍‍‍హీరో శివాజీ

ట్రెండింగ్ వార్తలు