ఓటీటీలోకి వచ్చేసిన హాయ్ నాన్న… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

January 4, 2024

ఓటీటీలోకి వచ్చేసిన హాయ్ నాన్న… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో సరికొత్త కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత ఏడాది రెండు సినిమాల ద్వారా నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దసరా సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం మరొక నూతన దర్శకుడు శౌర్యువ్ అనే కొత్త దర్శకుడుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమా గతేడాది డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా సమయంలోనే విడుదల అయ్యి 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతూ మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నాని సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించారు.

నాని కూతురు పాత్రలో బేబీ కియారా ఖన్నా నటించి తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇలా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈ సినిమా నెల రోజుల కంటే ముందుగానే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది ముందుగా చెప్పిన విధంగానే జనవరి నాలుగో తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి ఒక ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ సినిమాని థియేటర్లో మిస్ అయినటువంటి వారు ఓటీటీలో చూసే అవకాశం లభించిందని చెప్పాలి. మరి థియేటర్లో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ఇక్కడ డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Read More: సలార్ 2 వచ్చేది అప్పుడేనా… అసలు విషయం చెప్పిన నిర్మాత?

ట్రెండింగ్ వార్తలు