కొరటాల శివతో సత్యదేవ్‌ చిత్రం ‘కృష్ణమ్మ’

July 3, 2022

కొరటాల శివతో సత్యదేవ్‌ చిత్రం ‘కృష్ణమ్మ’

ఇటీవ‌ల న‌టుడు స‌త్య‌దేవ్‌కి అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు..చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొడుతున్నాయి. తిమ్మ‌రుసు, స్కైలాబ్ చిత్రాలు ఆ జాబితాలోనివే.. సత్యదేవ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. వీవీ గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 3న సత్యదేవ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కృష్ణమ్మ’ చిత్రంలోని సత్యదేవ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.కాగా ఈ పోస్ట‌ర్‌పై నెటిజ‌న్లు పెద‌వివిరుస్తున్నారు. స‌త్య‌దేవ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన ఈ పోస్ట‌ర్ ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక పోయింది.

SatyaDev Krishnamma

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘కృష్ణమ్మ’ సినిమాను సెప్టెంబరులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె తారక్‌ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగ నటించిన ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఇక సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నచిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, అక్షయ్‌కుమార్‌ ‘రామ్‌సేతు’లు కూడా ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అయ్యాయి

ట్రెండింగ్ వార్తలు