దేవర మూవీకి ట్రబుల్స్ ఇస్తున్న అనిరుద్.. అసలు ఏం జరిగిందంటే!

February 26, 2024

దేవర మూవీకి ట్రబుల్స్ ఇస్తున్న అనిరుద్.. అసలు ఏం జరిగిందంటే!

దేవర సినిమా షూటింగ్ అప్డేట్స్ లేట్ అవుతున్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫైర్ అవుతున్నారు.అయితే దీనంతటికీ కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అనే టాక్ ఒకటి ఇండస్ట్రీలో నడుస్తుంది మామూలుగానే అవుట్ పుట్ ఇవ్వడంలో అనిరుద్ కాస్త డిలే చేస్తాడని కానీ అవుట్ పుట్ అదిరిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరని సినీ వర్గాల టాక్. అయితే దేవర విషయంలో కూడా ఇదే జరుగుతుందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాల వారు.

దేవర మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న అనిరుద్ కంప్లీట్ గా రజనీకాంత్ సినిమాతో పాటు 12 సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో మార్చి 8 కి దేవర టీజర్ అనుకుంటే దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసి రెడీ చేసే పరిస్థితిలో లేడంట అనిరుద్. చేతిలో ఉన్న 12 సినిమాలు తో అనిరుద్ బిజీ అయితే మాత్రం అక్టోబర్ పదికి వాయిదా పడ్డ దేవర సినిమా అప్పుడు కూడా విడుదలవ్వడం కష్టమే అంటున్నారు ప్రేక్షకులు.

నిజానికి సినిమాలో ఆయుధ పూజ సందర్భంగా వచ్చే పాట ఒకటి ఉంటుంది. ఆ పాటకి ట్యూన్ ఇవ్వకపోవడంతో కొన్నాళ్ల క్రితం వేసుకున్న షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకోవలసి వచ్చిందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ నుంచి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఈ విధంగా డేట్ లు వృధా అయ్యాయని తెలుస్తుంది. సినిమా మీద ఫోకస్ పెట్టి ట్యూన్స్ ఇవ్వడం, రికార్డింగ్ చేయడం పై దృష్టి పెడితే అనుకున్న టైం కి సినిమా రిలీజ్ అవుతుంది.

లేదంటే ముందుగా అనుకున్నట్లు సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవ్వటం కూడా కష్టమే. అనిరుద్ వర్క్ ఎంత బాగున్నప్పటికీ టైం కి వర్క్ ఫినిష్ చేయడం కూడా ముఖ్యమే కదా అంటున్నారు ప్రేక్షకులు. వారి కంగారు సహజమే కదా ఎంత తొందరగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటని వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఆశలపై అనిరుద్ నీళ్లు చల్లడం సహించలేకపోతున్నారు.

Read More: జంటగా అక్కడ పూజలు నిర్వహించిన మెగా దంపతులు.. అదే కారణమా?

ట్రెండింగ్ వార్తలు