January 20, 2024
విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.
ఇక విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. మార్చి నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట శ్రీలీల పేరు వినిపించింది.. అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీలీల స్థానంలో లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది. త్రిప్తితో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో మరో కథానాయికగా ఎంపిక అయినట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఇప్పటి వరకు శ్రీలల డేట్స్ కోసం చాలా మంది హీరోలు వెయిట్ చేశారు అయితే ఫస్ట్ టైమ్ శ్రీలలని ఒక సినిమా నుండి తప్పించడం నిజంగా ఆలోచించాల్సిన విషయం.
Read More: రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్