రాజమౌళి, మహేష్ బాబుల కాంబో అప్డేట్ అప్పుడేనా.. అడ్వెంచర్ జానెర్ లో మూవీ!

March 26, 2024

రాజమౌళి, మహేష్ బాబుల కాంబో అప్డేట్ అప్పుడేనా.. అడ్వెంచర్ జానెర్ లో మూవీ!

తాజాగా గుంటూరు కారం సినిమాతో థియేటర్ల దగ్గర రచ్చ చేసిన మహేష్ బాబు కొన్ని సంవత్సరాలు వరకు ఇంక థియేటర్లలో ప్రేక్షకులకు కనపడరు. ఎందుకంటే తన రాబోయే చిత్రం ఎస్ఎస్ రాజమౌళితో తీయబోతున్నారు. ఇంక రెండు మూడు సంవత్సరాల వరకు ఎటువంటి సోషల్ మీడియాలలో కూడా మహేష్ బాబు కనిపించరు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కథ రాయడం కూడా పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

మరి ఈ సినిమా అనౌన్స్మెంట్లు, అప్డేట్ ల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి సినిమా కనుక ఇది ఇప్పుడు అప్పుడే విడుదల అవ్వదు అని అందరికీ తెలిసిందే. కానీ కనీసం అప్డేట్లు గురించి ఎదురు చూడడంలో తప్పులేదు కదా. ఈ సినిమా గురించి మొదటి అప్డేట్ ఉగాది రోజు వస్తుందని చాలామంది అనుకుంటున్నారు కానీ హాలీవుడ్ న్యూస్ ప్రకారం అప్డేట్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న వస్తుందట.

మరి ఆ అప్డేట్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఆ? లేకపోతే సినిమా టైటిలా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి ఎవరికీ ఎటువంటి అంచనా కూడా లేదు. ఒక అడ్వెంచర్ జానెర్ లో ఉంటుందని, ఆఫ్రికన్ ఫారెస్ట్ లో షూట్ చేస్తున్నారనే తెలుసు. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా ఎటువంటి అవగాహన ఎవరికి కనిపించడం లేదు.

అప్డేట్లు లేకుండా ఉండేందుకు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటినుంచే ప్రిపేర్ అవ్వాలి మరి. ఎందుకంటే అక్కడ రాజమౌళి గురించి తెలిసిందే కదా. కనుక ఆగస్టు 9 వరకు వేచి ఉండాలి. మరోవైపు ఈ సినిమా షూటింగ్ కోసం అవతార్ కి వాడినటువంటి కెమెరాలు వాడుతున్నారని ప్రచారం వినిపిస్తుంది. ఒక ప్రముఖ హాలీవుడ్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాజమౌళి ఏ రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారో ఆయన ఊహకే తెలియాల్సి ఉంది.

Read More: రెండో పెళ్లి చేసుకోబోతున్న మీనా.. డబ్బు కోసం ఇంత పని చేస్తారా అంటూ ఫైర్ అయిన నటి?

ట్రెండింగ్ వార్తలు