November 26, 2021
సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు మహేష్..దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. తమ అభిమాన హీరో లుక్‌ని ఇండియా వైడ్‌గా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మహేశ్. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు పలు బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..అందులో భాగంగానే మహేష్ పాల్గొన్న ఓ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతుంది. కంప్టీట్ బ్లాక్ డ్రెస్‌లో చేతిలో మొబైల్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు.
ప్రస్తుతం మహేశ్ సూపర్ స్టైలిష్ లుక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్, కీర్తి తొలిసారి జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022, ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్.