ఉపాసన, ప్రణతి, బ్రాహ్మణి.. ఆ విషయంలో ముగ్గురు ముగ్గురే..ఎవరు సాటి రారుగా?

April 26, 2024

ఉపాసన, ప్రణతి, బ్రాహ్మణి.. ఆ విషయంలో ముగ్గురు ముగ్గురే..ఎవరు సాటి రారుగా?

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఇక్కడ అందాలను ఆరబోస్తేనే అవకాశాలు ఉంటాయి అందుకే సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో గ్లామర్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్లను మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇలా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తూ ఉంటారు.. ఇలా ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు భార్యలు కూడా భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు.

ఇకపోతే మరికొందరు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఏమాత్రం హద్దులు మీరి ప్రవర్తించరు. వారు ఫ్యాషన్ దుస్తులను, ట్రెండీ వేర్ ధరించిన చాలా పద్ధతిగా ఉంటాయి. ఎప్పుడూ కూడా హద్దులు మీరరు అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన(Upasana ) యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) నటుడు నందమూరి నటసింహ బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి (Brahmani ) కూడా ఒకరైన చెప్పాలి.

ఈ ముగ్గురు కూడా ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కావటం విశేషం అంతేకాకుండా బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. లక్ష్మీ ప్రణతి మాత్రమే ఇంటికి పరిమితమైన ఉపాసన బ్రాహ్మణి బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ ముగ్గురు ఎన్నో సందర్భాలలో బయట కనిపించిన ఎప్పుడు కూడా ఫ్యాషన్ దుస్తులను ధరించలేదు ఒకవేళ ధరించిన చాలా పద్ధతిగా ధరిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా హద్దులు మీరి  దుస్తులు ధరించి ఇంటి పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేలా వ్యవహరించలేదని చెప్పాలి.

ఇలా ఈ ముగ్గురు బయట ఎక్కడ కనిపించినా చాలా పద్ధతిగా కనిపించడంతో అభిమానులు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వస్త్రధారణ విషయంలో ఈ ముగ్గురు ముగ్గురేనని ఎప్పుడూ కూడా గ్లామర్ షో చేయకుండా స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు అంటూ పలువురు వీరి వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఆ డైరక్టర్ కారణంగా ప్రభాస్ ఎన్టీఆర్ మద్య మాటలు లేవా.. ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు