మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీకి చరణ్ అందిస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ డాక్టరేట్ ప్రధాన ఉత్సవ కార్యక్రమాలు నేడు సాయంత్రం జరగబోతున్నటువంటి తరుణంలో రామ్ చరణ్ తన భార్య కుమార్తెతో కలిసి చెన్నై చేరుకున్నారు.ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన డాక్టరేట్ అందుకోబోతున్నారు. ఇక నేటినుంచి రామ్ చరణ్ కాస్త డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులను అందుకున్నటువంటి రామ్ చరణ్ నేడు డాక్టరేట్ అందుకోబోతున్నటువంటి తరుణంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో రామ్ చరణ్ మాత్రమే కాకుండా తన వెంట తన భార్య ఉపాసన అలాగే తన కుమార్తె క్లిన్ కారా కూడా వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రామ్ చరణ్ చెన్నై చేరుకోగానే పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్ పోర్ట్ కు చేరుకొని ఈయనకు ఘన స్వాగతం పలికారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఒకవైపు కెరియర్ పరంగా రామ్ చరణ్ ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసినదే .ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్నారు. అనంతరం సుకుమార్ డైరెక్షన్లో సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
https://telugu.chitraseema.org/raj-tarun-and-raashi-singh-new-movie-in-crime-comedy-genre/