చూడటానికి రెండు కళ్లు చాలవేమో.. సతీసమేతంగా రామ్ చరణ్, అల్లు అర్జున్

December 26, 2023

చూడటానికి రెండు కళ్లు చాలవేమో.. సతీసమేతంగా రామ్ చరణ్, అల్లు అర్జున్

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వంటి వారు ఒకరు. ఒకరు చిరంజీవి కుమారుడు కాగా మరొకరు మేనల్లుడు ఇలా వీరిద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక రామ్ చరణ్(Ram Charan) అల్లు అర్జున్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే.కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ తరచూ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇలా వీరిద్దరి గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి వీరిద్దరూ కలిసి ఆ వార్తలకు చెక్ పెడుతూ ఉంటారు. ఇటీవల మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ వివాహ వేడుకలలో ఎంతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే చోట చేరి ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అల్లు అర్జున్ సతీసమేతంగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అల్లు అర్జున్ రాంచరణ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించగా స్నేహ రెడ్డి ఉపాసన మాత్రం రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించారు. ఇలా అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఉపాసన రాంచరణ్ దంపతులు కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఇద్దరి హీరోలను సతి సమేతంగా చూసి చాలా కాలమైందని అభిమానులు ఈ ఫోటోపై ఎంత సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో మరోసారి వీరి గురించి వచ్చే వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.

Read More: స‌ముద్రం మ‌ధ్య‌లో షూట్‌..తండేల్ నుండి నాగ‌చైత‌న్య ఎన‌ర్జిటిక్ పోస్ట‌ర్

ట్రెండింగ్ వార్తలు