అందుకే ఇప్పటివరకు ప్రభాస్ కి పెళ్లి కాలేదు..వేణు స్వామి లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

February 28, 2024

అందుకే ఇప్పటివరకు ప్రభాస్ కి పెళ్లి కాలేదు..వేణు స్వామి లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఇప్పటివరకు సింగిల్గానే ఉన్నారు. ప్రభాస్ నాలుగుపదుల వయసులో ఉన్నారు. ఇప్పటికి ఇంకా ఈయన పెళ్లి చేసుకోకపోవడంతో ప్రభాస్ పెళ్లి గురించి తరచు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ వీటికి తెలివిగా సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు.

ఇలా ప్రభాస్ వయసు పై బడుతున్న ఇంకా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి మాత్రం ఆయనలో కనిపించలేదు అయితే తన కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేసిన ఈయన పెళ్లి మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇకపోతే ఈయన పలువురు హీరోయిన్లతో అఫైర్స్ కొనసాగించారు అంటూ ప్రభాస్ కి సంబంధించి ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్ అనుష్క ఇద్దరు ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

వీరి పెళ్లికి కృష్ణంరాజు ఒప్పుకోలేదని అందుకే ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ లేదని స్పష్టత వచ్చింది. నటి కృతి సనన్ తో ప్రభాస్ రిలేషన్ లో ఉన్నారని వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారు అంటూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన గతంలో ఎన్నోసార్లు ప్రభాస్ గురించి మాట్లాడారు. ఇలా ప్రభాస్ గురించి నేను ఏ విషయం చెప్పినా ఆయన అభిమానులు నన్ను తిడతారు. కానీ నేను చెప్పేది నిజం అంటూ వేణు స్వామి తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్లు చేశారు. ప్రభాస్ కి ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆయన జాతకంలో ఉన్నటువంటి దోషం కారణమని, ఆ దోష నివారణ జరిగితేనే ఆయనకు పెళ్లి అవుతుంది అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: క్రిస్మస్ కి రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. విడుదల తేదీ ఫిక్స్?

ట్రెండింగ్ వార్తలు