ప్రమోషన్స్‌ కోసం ఇంత దిగజారాలా…విజయ్‌ దేవరకొండపై నెటిజన్లు ఫైర్‌

July 2, 2022

ప్రమోషన్స్‌ కోసం ఇంత దిగజారాలా…విజయ్‌ దేవరకొండపై నెటిజన్లు ఫైర్‌

‘అర్జున్‌రెడ్డి’ సినిమా సక్సెస్‌ విజయ్‌దేవరకొండకు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. ఇండస్డ్రీలో, యూత్‌లో రౌడీస్టార్‌ అనే ఇమేజ్‌ను తీసుకువచ్చింది. అర్జున్‌ రెడ్డి తర్వాత విజయ్‌ దేవరకొండ చేసిన కొన్ని సినిమాలు సరిగా ఆడక పోయినప్పటికీని విజయ్‌ రేంజ్‌ మాత్రం తగ్గలేదు. ఇలా విజయ్‌ హీరోగా చేసి రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమా ‘లైగర్‌’. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. పూరీ జగ న్నాథ్‌ ఈ సినిమాకు దర్శకుడు. అనన్యాపాండే హీరోయిన్‌. మైక్‌టైసన్, రమ్యకృష్ణ, మకరంద్‌ దేశ్‌ పాండే కీలక పాత్రధారులు.

Read More: విలన్‌గా రామ్‌చరణ్‌.. లుక్‌ చూసి పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘లైగర్‌’ నుంచి విజయ్‌దేవరకొండ ఉన్న కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హాప్‌న్యూడ్‌గా రోజా ఫ్లవర్స్‌తో ఉన్న ఈ ఫోటో పట్ల విజయ్‌ ఫ్యాన్సే కాదు..ఇటు నెటిజన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌లాంటి స్టార్‌ ప్రమోషన్స్‌ కోసం ఇలా చేయడం ఏంటి? చర్చించుకుంటున్నారు. అలాగనీ ఈ పోస్టర్‌ ఏం కొత్తది ఏం కాదు..రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన ఆమీర్‌ఖాన్‌ ‘పీకే’ ఫస్ట్‌లుక్‌ గుర్తుంది కదా. ఇంచుమించు అలాంటి పోస్టరే ఇది. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలోనే ‘లైగర్‌’ తర్వాత ‘జేజీఎమ్‌’ అనే సినిమా చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ చేస్తున్న ‘ఖుషీ’ చిత్రం కూడా సెట్స్‌పై ఉంది. ఇక సుకుమార్‌తో విజయ్‌కు ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు

Vijay Devarakonda

ట్రెండింగ్ వార్తలు