గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండ

August 25, 2022

గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండ

దేశవ్యాప్తంగా థియేటర్స్‌ మూవీ వేశారు సెకండ్‌ లాక్‌డౌన్‌ సమయంలో. టాలీవుడ్‌ అనే కాదు..చాలా ఇండస్ట్రీలోని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. ఈ సమయంలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా రూపొందిన ‘లైగర్‌’ సినిమాకు ఓ బడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నుంచి డైరెక్టర్‌ రిలీజ్‌కు 200కోట్ల ఆఫర్‌ వచ్చింది. కానీ లైగర్‌ టీమ్‌ వద్దనుకున్నారు. పైగా ఈ విషయంపై స్పందిస్తూ …‘థియేటర్స్‌లో నేను 200కోట్లకు పైగానే కలెక్ట్‌ చేస్తాను’ అని విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశాడు. కానీ ఈ రోజు( ఆగస్టు 25, 2022)న థియేటర్స్‌లో ‘లైగర్‌’ సినిమా విడుదలైంది. బిలో యావరేజ్‌ రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపు 90 కోట్ల ప్రి రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఇప్పుడు కనీసం ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయినా అవుతుందా? అని కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘లైగర్‌’ చిత్రం 200 కోట్లు వసూలు చేయాలంటే ఏదో అద్భుతమే జరగాలి. లేదా కలెక్షన్స్‌ పోస్టర్స్‌ దిగాలి.

ట్రెండింగ్ వార్తలు