ఇయర్‌ ఎండ్‌ క్లియరెన్స్‌…ఒకే రోజు మూడు సినిమాలు!

December 16, 2021

ఇయర్‌ ఎండ్‌ క్లియరెన్స్‌…ఒకే రోజు మూడు సినిమాలు!

ఈ ఏడాది డిసెంబరు 31న మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. రానా హీరోగా నటించి, సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ‘1945’ చిత్రం అప్పట్లో తెలుగు, తమిళం భాషల్లో రూపొందింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్‌కు ఇప్పుడు టైమ్‌ వచ్చింది. డిసెంబరు 31న ‘1945’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో సత్యరాజ్, నాజర్‌ కీ రోల్స్‌ చేయగా, రెజీనా హీరోయిన్‌. ఓ సైనికుడి ప్రేమ కథే ఈ చిత్రం. ఇక ఇప్పటికే పలుమార్లు వాయిదా మీద వాయిదాలు పడి రిలీజ్‌కు రెడీ అయిన చిత్రం ‘గుడ్‌లుక్‌సఖి’. నగేశ్‌ కూకునూరు దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కూడా డిసెంబరు 31నవిడుదల కానుంది. జగపతిబాబు, ఆదిపినిశెట్టి కీ రోల్స్‌ చేసిన ఈ చిత్రం రైఫిల్‌ షూటింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుంది. మరోవైపు రానా, కీర్తీసురేశ్‌లతో బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్న మరో హీరో శ్రీవిష్ణు. ఈ హీరో నటించిన అర్జున ఫల్గుణ రిలీజ్‌ కూడా డిసెంబరు 31నే కావడం విశేషం. తేజా మార్ని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ట్రెండింగ్ వార్తలు