April 25, 2022
Acharya: మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించాడు.ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు మొదటినుండి బజ్ తక్కువగానే ఉంది. రిలీజ్ దగ్గర పడుతున్న ఎందుకో రావాల్సిన బజ్ రావడం లేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ సినిమా కథ ఒక పురాతన ఆలయాన్ని కాపాడే వ్యక్తి కథ.. సాదారణంగా ఇలాంటి పాయింట్స్ తో చిన్న హీరోలు సినిమాలు చేస్తే ఒకే కాని స్టార్ హీరోలు సినిమా చేస్తే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన శక్తి సినిమానే దానికి ఉదాహరణ.
ఇక చిరంజీవి ఒకే సారి ఐదారు సినిమాలు అనౌన్స్ చేయడం కూడా ఈ సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కేవలం బజ్ పెంచడం కోసమే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్‌ని ఒక కీ రోల్‌లో తీసుకున్నారు. మొదట ఈ పాత్ర కోసం మహేష్‌ని సంప్రదించారు. మహేష్ కూడా ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే 15 నిమిషాల పాత్ర కోసం మహేష్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో అప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న రామ్ చరణ్‌తో ఆ క్యారెక్టర్ చేయించారు. దీని కోసం స్వయంగా చిరంజీవే రంగంలోకి దిగి రాజమౌళిని ఒప్పించాడు. మొదట చరణ్ ది 15 నిమిషాల నిడివిగల పాత్రే అని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. తర్వాత మనుసు మార్చుకుని 45నిమిషాలు కేరక్టర్ చేయించారు దర్శకుడు కొరటాల.
ఇది కూడా చదవండి: స్లిమ్‌లుక్‌లో ఎన్టీఆర్..ఫోటో వైరల్ చేసిన అభిమానులు