కోట్లు సంపాదించినా… నాది మధ్యతరగతి మెంటాలిటీనే: చిరంజీవి

April 1, 2024

కోట్లు సంపాదించినా… నాది మధ్యతరగతి మెంటాలిటీనే: చిరంజీవి

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఇటీవల సోషల్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ చిరంజీవి గారిని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి మాట్లాడుతూ పలు ప్రశ్నలు వేశారు. సర్ నేను ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పటికీ నాలో ఇంకా మిడిల్ క్లాస్ లక్షణాలు చాలా ఉన్నాయని తెలిపారు.

సడన్ గా స్నానం చేస్తున్నప్పుడు షాంపూ అయిపోతే ఆ షాంపు బాటిల్ లో వాటర్ వేసుకొని షాంపూ చేసుకుంటూ ఉంటాను ఇప్పటికీ నాలో ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంది ఇలా మీలో ఏవైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ నేను కూడా అలా షాంపూ బాటిల్లో వాటర్ వేసుకొని స్నానం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా సోప్ అయిపోతే ఆ చిన్న చిన్న సోప్స్ అన్నింటిని కూడా అతికించి మరొక సోప్ తయారు చేసుకునే అలవాటు కూడా ఉందని చిరంజీవి తెలిపారు.

ఇక మా ఇంట్లో చరణ్ వెకేషన్ వెళ్తే తన ఫ్లోర్ మొత్తం లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. వాటిని నేనే ఆర్పి వేస్తూ ఉంటాను ఇలా ఇంట్లో ఎక్కడ ఫ్యాన్స్ ఆన్ లో ఉన్నాయి ఎక్కడ వాటర్ వృధాగా పోతున్నాయి ఎక్కడ గీజర్ ఆన్ లో ఉందనే విషయాలన్నింటిని చెక్ చేయడానికి నా ఫోన్లో ఒక యాప్ ఉందని వాటన్నింటినీ అక్కడ చెక్ చేసి ఎక్కడైతే ఆన్ లో ఉన్నాయో వాటిని ఆఫ్ చేస్తూ ఉంటానని తెలిపారు.

ఇలా నేను కోట్లు సంపాదించినప్పటికీ ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరికి పొదుపు అనేది చాలా అవసరం కనుక వీటన్నింటినీ నేనే చూసుకుంటాను ఇలా కోట్లు సంపాదించిన నేను ఒక మధ్య తరగతి మెంటాలిటీ తోనే వ్యవహరిస్తానని చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇటీవల బెంగళూరులో తాను ఇల్లు కట్టానని, నీటి ఎద్దడిని అరికట్టడానికి ఇంట్లో ఫార్మ్ హౌస్ లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: అచ్చ‌తెలుగు టైటిల్‌తో సుహాస్ ప్రేమ‌క‌థా చిత్రం

ట్రెండింగ్ వార్తలు