విశ్వంభర మూవీ లేటెస్ట్ అప్డేట్.. హైదరాబాదులో కంప్లీట్ చేసుకున్న మూవీ షూటింగ్..

March 22, 2024

విశ్వంభర మూవీ లేటెస్ట్ అప్డేట్.. హైదరాబాదులో కంప్లీట్ చేసుకున్న మూవీ షూటింగ్..

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ ఇన్ని రోజులూ హైదరాబాదులో జరిగింది. ఈ సినిమాపై వశిష్ట రిలీజ్ చేసిన ఒక్కొక్క అప్డేట్ గూస్ బంప్స్ ని తెప్పిస్తూ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి ట్విన్ బ్రదర్స్ గా కనిపించబోతున్నారు. అంతేకాకుండా ఒక పాత్ర కోసం 70 ఏళ్లు పైబడిన వృద్ధుడిగా కనిపించబోతున్నారు.

అయితే ఈ విషయాన్ని ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చిరంజీవి రిస్క్ చేస్తున్నారు.. వశిష్ట చేస్తున్నాడు భారీ బడ్జెట్ సినిమాలో ఇలాంటి రిస్క్ చేయడం చాలా తప్పు అంటూ వశిష్ట కు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివిల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేశారు అది వైరల్ గా మారడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. గత కొద్ది రోజులుగా హైదరాబాదులో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ తాజాగా పూర్తయినట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది.

హైదరాబాద్ షెడ్యూల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ సినిమాలో భీమవరం దొరబాబుగా చిరంజీవి కనిపించబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించడం విశేషం. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా, యు వి క్రియేషన్స్ సంస్థ సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుంది.

ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమాని 2025 పండగకి సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో చిరంజీవి ఢీకొట్టే పాత్రలో ప్రముఖ నటుడు రావు రమేష్ నటిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ రోల్స్ లో కూడా మంచి సక్సెస్ ని సాధించిన రావు రమేష్ చిరంజీవికి కరెక్ట్ కాంబినేషన్ అంటున్నారు ప్రేక్షకులు. చిరంజీవి రావు రమేష్ తండ్రి రావు గోపాల్ రావు కాంబినేషన్లో కూడా మంచి హిట్ సినిమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Read More: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భర్త్డే గిఫ్ట్.. ఆ రోజే అనౌన్స్ చేయబోతున్న ఆర్ సి17 సినిమా ముచ్చట్లు!

ట్రెండింగ్ వార్తలు