ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఓ ఇంటివాడ‌య్యాడు..

November 21, 2021

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఓ ఇంటివాడ‌య్యాడు..
ఎలాగైనా సినిమాల్లోకి రావాలని క‌ల‌లు క‌న్నాడు..సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా క‌ష్ట‌ప‌డి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమా ఆర్ఎక్స్ 100తో సూప‌ర్‌హిట్ సాధించాడు. త‌న ప్రియురాలు లోహిత కిచ్చిన మాట ప్ర‌కారం హీరో అయ్యాక పెద్ద‌లను ఒప్పించి ఈ రోజు పెళ్లి పీట‌లెక్కాడు యువ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ.హైద‌రాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో ఇవాళ ఉద‌యం 9.47 గంట‌ల‌కు లోహిత మెడ‌లో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ. కుటుంబ‌స‌భ్యులు, సినీ ప్ర‌ముఖులు, స్నేహితుల స‌మ‌క్షంలో కార్తికేయ‌-లోహిత పెళ్లి వేడుక అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. వ‌ధూవ‌రులు సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మెరిసిపోయారు. పెళ్లి వేడుక‌లో కార్తికేయ తొలి హీరోయిన్, ఆర్ఎక్స్ 100 ఫేం పాయ‌ల్ రాజ్‌పుత్ బ్లూ డ్రెస్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.మెగాస్టార్ చిరంజీవి వివాహ‌వేడుక‌కు హాజ‌రై..నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. కార్తికేయ‌, లోహిత పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు