సూర్య సినిమా చూసి మాజీ లవర్ ను కలిసిన అల్లు శిరీష్.. చివరికి ఏమైందంటే?

February 20, 2024

సూర్య సినిమా చూసి మాజీ లవర్ ను కలిసిన అల్లు శిరీష్.. చివరికి ఏమైందంటే?

అల్లు శిరీష్ పరిచయం అవసరం లేని పేరు సినీ ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అల్లు వారసుడిగా శిరీష్ అందరికీ ఎంతో సుపరిచితమే.ఇలా స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ శిరీష్ మాత్రం అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. ఇలా అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయనకు సరైన సక్సెస్ మాత్రం పడలేదని చెప్పాలి.

ఇక హీరోగా సక్సెస్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండే అల్లు శిరీష్ తన ప్రేమ వ్యవహారాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. అయితే తన ప్రేమ గురించి బ్రేకప్ లు గురించి ఇప్పటికే ఎన్నో సందర్భాలలో శిరీష్ స్పందించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన ప్రేమ విషయం గురించి ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం తెలియజేశారు. సాధారణంగా సినిమాలను చూసి కొందరు ఇంప్రెస్ అవుతూ నిజజీవితంలో కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శిరీష్ కూడా అలాగే చేశారట.

ఇక సినిమాలో హీరోకి వర్కౌట్ అయినట్లు నిజజీవితంలో తనకి వర్క్ అవుట్ అవుతుందని భావించారు. కానీ నిజజీవితంలో మాత్రం ఈయన చేసిన పని అట్టర్ ఫ్లాప్ అవడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ తాజాగా శిరీష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో హీరోతో హీరోయిన్ మాట్లాడకపోవడంతో స్వయంగా హీరో హీరోయిన్ ఇంటికి వెళ్లి ఆమెను ఇంప్రెస్ చేస్తారు అదే విధంగా అల్లు శిరీష్ కూడా తన మాజీ లవర్ ని కలిసారట.

ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తనని బ్లాక్ చేశారని దీనితో తనని కలవడం కోసం పొద్దున్నే ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరుకు వెళ్లానని తెలిపారు. అక్కడికి వెళ్లేసరికి అమ్మాయి ఇంట్లో తన తల్లిదండ్రులు కూడా ఉన్నారని తెలిసి షాక్ అయ్యారట. దీంతో ఫోన్ బ్లాక్ చేసానని ఇలా ఇంటికి వచ్చేస్తావా అంటూ స్వయంగా వారందరూ తనకు వారి స్టైల్ లోనే క్లాస్ పీకి పంపారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శిరీష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: నా తొలి సంపాదన 5 వేలే… వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను: రకుల్

ట్రెండింగ్ వార్తలు