April 6, 2024
నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా మొదటి సినిమాతో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. తెలుగులో ఈమె చలో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించారు అలాగే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు ఈ క్రమంలోనే పుష్ప సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించినటువంటి ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక ఈ సినిమాతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా అనంతరం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలలో నటిస్తున్నారు.
ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి రష్మిక ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఈమె మొదటి సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయానికి వస్తే..
కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నిర్మాణంలో ఆయన హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా 1.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం. ఇదే తన ఫస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. అనంతరం చలో సినిమాకు 50 లక్షలు తీసుకున్నారని తెలుస్తోంది.
Read More: పెళ్లయిన వెంటనే గుడ్ న్యూస్ అంటున్న రకుల్.. తల్లి కాబోతున్నారా?