ఎన్టీఆర్ శరీర బరువుపై ఆ కమెడియన్ అలా మాట్లాడారా.. తండ్రిలా ఉన్నావ్ అంటూ?

April 3, 2024

ఎన్టీఆర్ శరీర బరువుపై ఆ కమెడియన్ అలా మాట్లాడారా.. తండ్రిలా ఉన్నావ్ అంటూ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఈయన బాలా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన RRR సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాలన్నీ కూడా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫిజిక్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ గతంలో మాత్రం అధికంగా శరీర బరువు ఉండేవారు ముఖ్యంగా ఈయన రాఖీ సినిమా సమయంలో అధిక శరీర బరువు ఉండేవారు.

ఇలా ఎన్టీఆర్ అధిక శరీర బరువు ఉండడంతో ఈయన పట్ల చాలామంది విమర్శలు చేశారు. ఈ సినిమా తర్వాత ఈయన శరీర బరువు తగ్గాలన్న ఉద్దేశంతో భారీ స్థాయిలో శరీర బరువు తగ్గిపోయారు. యమదొంగ కంత్రి సినిమాలో ఎన్టీఆర్ లుక్ అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ విధంగా ఎన్టీఆర్ యమదొంగ సినిమా సమయంలో కమెడియన్ ఆలీతో ఒక ప్రశ్న వేశారట అన్న ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని అడగగా ఆలీ మాత్రం షాకింగ్ సమాధానం చెప్పారట.

ఇంతకుముందు నువ్వు హరికృష్ణకు తండ్రి లాగా ఉండేవాడివి ఇప్పుడు ఎన్టీఆర్ కి కొడుకు లాగా ఉన్నావు అంటూ కామెంట్ చేశారట. ఇలా అలీ చేసినటువంటి కామెంట్స్ ఎన్టీఆర్ ను బాధించాయని తెలుస్తోంది. అదేంటన్న అంత మాట అనేశావు. నేను అంత చెండాలంగా ఉండే వాడిన అంటూ అడిగారట. అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ పోనీలే హరికృష్ణకు తండ్రి అన్నావు చూడు హ్యాపీగా ఉంది. హరికృష్ణ తండ్రి అంటే ఎన్టీఆర్ గారు కదా నన్ను తాత గారితో పోల్చినందుకు సంతోషం అంటూ చెప్పారట ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తెలియచేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

Read More: వందల కోట్ల ఆస్తి ఉన్న రాజమౌళి ఆ పని మాత్రం చేయ్యారా?

ట్రెండింగ్ వార్తలు