February 2, 2022
Ajith Valimai Release Date Fix: అజిత్ కుమార్ (Ajith Kumar)కు తమిళనాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా అభిమానులను అలరించే సినిమాలు చేస్తూ మాస్ హీరోగా బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
నెర్కొండ పార్వై(Nerkonda Paarvai) తర్వాత అజిత్ – హెచ్. వినోద్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న అజిత్ తాజా చిత్రం వలిమై (Ajith Valimai) సంక్రాంతికి విడుదలకావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 24వ తేదీన మలయాళం మినహా తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ బాషల్లో విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉండడంతో అజిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.Read More: Prabhas: రాధేశ్యామ్ కి ముందూ వెనక పొంచి ఉన్న రిస్కులు ఇవేనా?మరోవైపు పనవ్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25తో పాటు ఏప్రిల్ 1న వస్తున్నట్టు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఒకవేళ కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ వస్తుంది. ఇదే జరిగితే తెలుగులో అజిత్ ‘వలిమై’ సినిమాకు పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ తప్పదనే చెప్పాలి.
‘వలిమై’ ట్రైలర్ డిసెంబర్ 30న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తెలుగు హీరో కార్తికేయ కూడా ఒక పాత్రలో నటించారు. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే ట్రైలర్ గ్రాండ్ విజువల్స్‌తో అదిరిపోయింది. ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు.
జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం నీరవ్ షా లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా హిందీ భామ హ్యుమా ఖురేషి నటిస్తున్నారు.
Read More: రావణాసుర సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉందంటూ పోస్ట్