Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 త‌ర్వాత సినిమాలు ఫ్లాప్సే కానీ….!

February 20, 2022

Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 త‌ర్వాత  సినిమాలు ఫ్లాప్సే కానీ….!

అజిత్‌కుమార్‌ హీరోగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘వలిమై’. ఈ సినిమా ఈ నెల 24న ప్యాన్‌ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. హ్యూమాఖురేషీ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ(Karthikeya) విలన్‌ పాత్ర చేశారు. బోనీకపూర్‌ నిర్మించిన వలిమై చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ (Karthikeya) ఇచ్చిన ఇంటర్వ్యూ…

అందుకే వలిమై ఒప్పుకున్నాను నానీస్‌ ‘గ్యాంగ్‌లీడర్‌’లో నేను చేసిన విలన్‌ రోల్‌ కన్నా కూడా వలిమై చిత్రంలో నేను చేసిన నెగటివ్‌ రోలే నాకు మరింత చాలెంజింగ్‌గా అనిపించింది. గ్యాంగ్‌లీడర్‌లో కేవలం రేసర్‌ మాత్రమే కావాలను కుంటాడు విలన్‌. కానీవలిమైలో నేను చేసిన విలన్‌ రోల్‌లో ఎన్నో షేడ్స్‌ ఉన్నాయి. ఎమోషన్స్‌ అండ్‌ లేయర్స్‌ ఉన్నాయి. నేను విలన్‌గాసినిమాలు చేస్తాను. కానీ నాకంటూ కొన్ని షరతులు ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఉంటనే నేను విలన్‌ రోల్స్‌చేస్తాను. అలాగే అజిత్‌సార్‌తో సినిమా అంటే కెరీర్‌ పరంగా నాకు మంచి ప్లస్‌ అవుతుంది. ఇతర భాషల్లో కూడా నా నటన గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నా మార్కెట్‌ పెరుగుతంది. అందుకే ఈ చిత్రం దర్శకుడు హెచ్‌.వినోద్‌ కథ చెప్పినప్పుడు ‘వలిమై’ సినిమాను ఒప్పుకున్నాను.
భీమ్లానాయక్‌ రిలీజ్‌ గురించి నాకు తెలియదు మా వలిమై చిత్రం ఈ నెల 24న విడుదల అవుతోంది. ఒక్కరోజు గ్యాప్‌లో పవన్‌కల్యాణ్‌గారి భీమ్లానాయక్‌ రిలీజ్‌ అవుతోంది. పవన్‌కల్యాణ్‌గారి భీమ్లానాయక్‌ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పుడు నేను చెన్నైలో ఉన్నా.భీమ్లానాయక్‌ ఈ నెల 25న వస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ముందే తెలిసి ఉంటే మా యూనిట్‌తో ఏమైనా మాట్లాడి ఉండేవాడిని. కచ్చితంగా తెలుగులో భీమ్లానాయక్‌ ఎఫెక్ట్‌ వలిమైపై ఉంటుంది.
నా సినిమాలు ఫ్లాప్స్‌ కానీ… నా కెరీర్‌లో నేను ఇప్పటికి అరడజను సినిమాలు చేశాను. కానీ ఇప్పటికీ నన్ను నా తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’ తోనే గుర్తు పెట్టుకున్నారు. ఈ సినిమా హీరోగా నాకు, దర్శకుడిగా అజయ్‌ భూపతికి, హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌కు ఓ వరంలా వచ్చింది. ఓ మ్యూజిక్‌లా ఆర్‌ఎక్స్‌ 100 సక్సెస్‌ జరిగిపోయింది. ఆ తర్వాత హీరోగా నేను, దర్శకుడిగా అజయ్‌ చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇటు పాయల్‌రాజ్‌పుత్‌ కెరీర్‌ కూడ ఆమె ఆశించనంతగా లేదనే అనుకుంటున్నాను. నా విషయానికి వస్తే…నేను చేసిన సినిమాలు ఆడలేదు. కానీనా ఆఫర్స్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఓ యాక్టర్‌గా వందశాంత నేను నా ఎఫర్ట్స్‌ ఇస్తున్నాను. రిజల్ట్స్‌మన చేతుల్లో ఉండవు. వచ్చిన వెంటనే నేను ఏదో చిరంజీవిగారి స్థాయికి వెళ్లాలనే తాపత్రయం నాకు లేదు. కెరీర్‌ మొదట్లోనే ఉన్నాను. జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటు వెళ్తాను.
ఈ చిత్రం గురించి సుకుమార్‌ ఏం మాట్లాడం లేదు సుకుమార్‌రైటింగ్స్‌లో నేను ఓ సినిమా కమిటైయ్యాను. ఈ చిత్రానికి సుకుమార్‌గారు కథ, స్క్రీన్‌ ప్లే, ఓ నిర్మాత కూడా. ఓ సారి ఫోన్‌ చేసి మాట్లాడి, సినిమాను అనౌన్స్‌చేశారు. కానీ ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. ఆయన పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారెమో. ఇక యూవీక్రియేషన్స్, లౌక్య ప్రొడక్షన్స్, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో నేను సినిమాలు కమిటైయ్యాను. యూవీలో దర్శకుడు ప్రశాంత్‌తోనేను చేస్తోన్న సినిమా ఆల్మోస్ట్‌ పూర్తయింది. అలాగే ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నేను, అజయ్‌భూపతి కలిసి ఓసినిమాను చేయనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే ఉంటుంది. లవ్‌బ్యాక్‌డ్రాపే కానీ ఆర్‌ఎక్స్‌ 100కు సీక్వెల్‌ కాదు. త్వరలో వివరాలు వెల్లడిస్తాం.
Read more..Alia Bhatt: ప్యాన్‌ ఇండియన్ యాక్ట్రెస్ అవ్వాల‌నేది నా డ్రీమ్‌

ట్రెండింగ్ వార్తలు