September 5, 2022
Akhil Akkineni: శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాలో శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమలా, శర్వాలతో కలిసి ‘అమ్మ చేతి వంట’ అనే చిట్‌చాట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో అక్కినేని అఖిల్ కూడా పాల్గొనడం విశేషం. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. సరదాగా సాగిన ప్రోమో వీడియోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అఖిల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
‘ప్రభాస్ చాలా ఫుడీ’ అంట కదా అని అమలా అడగ్గా.. దానికి అఖిల్ బదులిస్తూ.. ‘అవును ప్రభాస్‌ను కలిసిన సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలు తినలేను అన్నా కూడా వదిలి పెట్టరు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఇక మరో పక్క నుంచి శర్వానంద్ మాట్లాడుతూ.. ఒక 30 రకాల డిషెస్‌తో అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రోమో సరదా సరదాగా సాగింది. మరి పూర్తి ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు చర్చిస్తారో చూడాలి.