పవన్‌కళ్యాణ్‌ టైటిల్‌తో అఖిల్‌ సినిమా?

July 11, 2022

పవన్‌కళ్యాణ్‌ టైటిల్‌తో అఖిల్‌ సినిమా?

అఖిల్‌ ప్రజెంట్‌ ‘ఏజెంట్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్‌ అయ్యే చాన్సెస్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత అఖిల్‌ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడు? అనే చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘బొమ్మరిల్లు భాస్కర్‌’, కిశోర్‌ తిరుమల వంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఏ సినిమా ఫైనల్‌గా కాలేదు. ఓ తమిళ దర్శకుడి పేరు కూడా వినిపించింది

ప్రజెంట్‌ మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అతనే ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘ఏమ్‌సీఏ’, రీసెంట్‌గా ‘వకీల్‌ సాబ్‌’ సినిమాలు తీసిన వేణు శ్రీరామ్‌. అఖిల్‌తో సినిమా చేయాలని వేణు శ్రీరామ్‌ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తు న్నాడట. ఇందులో భాగంగానే బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌ ఉన్న ఓ కథను వినిపించాడట వేణు. ఈ కథ అఖిల్‌కు నచ్చిందట. దీంతో ఈ సినిమాపై మరింత స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు వేణు. ఒకే కానీ ఈ సినిమా టైటిల్‌ విషయంలోనే ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లో ‘తమ్ముడు’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌కు అఖిల్‌తో తాను చేయబోయే సినిమాకు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట వేణు.

మరోవైపు పవన్‌కళ్యాణ్‌ హీరోగా చేసిన సినిమాల టైటిల్స్‌ రిపీట్‌ అవ్వడం ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. వరుణ్‌తేజ్‌ ‘తొలిప్రేమ’ తీశారు. పవన్‌కళ్యాణ్‌ ‘బాలు’ సినిమాలో క్యారెక్టర్‌ ‘గని’తో టైటిల్‌తో వరుణ్‌ సినిమా చేశారు. రీసెంట్‌గా విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అఖిల్‌ ‘తమ్ముడు’ టైటిల్‌ తెరపైకి రావడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు