ఆ రోజే అల్లు అర్జున్ మైనపు విగ్రహ ఆవిష్కరణ.. ఈ మ్యూజియంలో కాదంట!

March 22, 2024

ఆ రోజే అల్లు అర్జున్ మైనపు విగ్రహ ఆవిష్కరణ.. ఈ మ్యూజియంలో కాదంట!

69 సంవత్సరాలలో జాతీయ అవార్డుని అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్. ఈ ఘనత సాధించిన అల్లు అర్జున్ మరొక ఘనతను కూడా సాధించటం విశేషం. అతని మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టబోతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రభాస్, మహేష్ బాబు ఈ ఘనతను సాధించారు.

ఆ తర్వాత ఈ ఘనత సాధించిన అభ్యర్థి అల్లు అర్జున్ కావటం విశేషం. అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని లండన్లో మేడం టుస్సాడ్ మ్యూజియంలో కాకుండా దుబాయ్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఈ మ్యూజియంలో ప్రదర్శన కాబోతున్న తొలి తెలుగు నటుడి మైనపు బొమ్మ అల్లు అర్జున్ ది కావడం విశేషం. అల వైకుంఠపురం సినిమాలో రెడ్ జాకెట్ తో ఉన్న అల్లు అర్జున్ విగ్రహం అక్కడ ప్రదర్శితం కాబోతోంది.

అల్లు అర్జున్ తన మైనపు విగ్రహం కోసం కొలతలు ఇవ్వటానికి లండన్ వెళ్లి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విగ్రహాన్ని ఎప్పుడు ఆవిష్కరిస్తారు అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే తమ అభిమాన హీరో మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ని అందించారు మేడం టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు. విగ్రహావిష్కరణకు ముహూర్తాన్ని నిర్ణయించారు. మార్చి 28న అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు మేడం టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి అల్లు అర్జున్ దుబాయ్ వెళ్ళబోతున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. పుష్ప సినిమా తో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న బన్నీ మేడం టుస్సాడ్ మ్యూజియంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా మరింత ఇమేజ్ పెరిగిపోవడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు.ఇక పుష్ప సినిమాతో బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఓర్మాక్స్ మీడియా బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల గురించి సర్వే నిర్వహించి జాబితాను ప్రకటించింది. ఈ సినిమాలో పుష్ప 2 మొదటి స్థానంలో నిలిచింది. అదీ బన్నీ క్రేజ్ అంటే.

Read More: కల్కి ఓటీటీ హక్కుల కోసం భారీ మొత్తం లో.. ఫైనల్ రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు