భర్తను ఉద్దేశిస్తూ అలాంటి పోస్ట్ చేసిన అనసూయ.. ఏకంగా దానితో పోల్చిందేంటీ?

March 6, 2024

భర్తను ఉద్దేశిస్తూ అలాంటి పోస్ట్ చేసిన అనసూయ.. ఏకంగా దానితో పోల్చిందేంటీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటీ అనసూయ ఒకరు. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో కెరియర్ పరంగా వెండి తెరపై ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ బుల్లితెరకు దూరమైన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక షూటింగ్స్ పరంగా తనకు ఏ మాత్రం విరామం దొరికినా కూడా వెంటనే తన భర్త పిల్లలతో కలిసి ఈమె వెకేషన్ కి వెళ్తూ ఉంటారు. ఇలా వెకేషన్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇలా వీరిద్దరి దాంపత్య జీవితం చూసి అభిమానులు వీరిపై ఎన్నో ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా తన భర్తను ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టు పై నెట్టిజెన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ గా ఈ విషయాన్ని షేర్ చేస్తూ..నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. అంటూ రాసుకొచ్చింది. ఆ వీడియో తన భర్తకు సరిగ్గా సరిపోతుందని చెప్పింది. ఇక ఈ వీడియోలో చింపాంజీ ఉండటం గమనార్హం. నీ భర్తను పోల్చుకోవడానికి ఇంతకన్నా మంచి వీడియో దొరకలేదా అంటూ నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

Read More: ఆ చిన్న పని చేసి స్టార్ హీరో నుంచి ఐదు కోట్లు అందుకున్న త్రిష.. వెలుగులోకి షాకింగ్ న్యూస్?

ట్రెండింగ్ వార్తలు