నేను తెలంగాణ బిడ్డనే.. మరోసారి ఆంటీ వివాదంలోకి అనసూయ?

April 5, 2024

నేను తెలంగాణ బిడ్డనే.. మరోసారి ఆంటీ వివాదంలోకి అనసూయ?

అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే వెండి తెరపై సినిమా అవకాశాలు రావడంతో వెండితెర పై వెళ్లినటువంటి అనసూయకు బుల్లితెర కార్యక్రమాలలో సమయం దొరకకపోవడంతో పూర్తిగా కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా వెండితెరపై కొనసాగుతూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె గతంలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినటువంటి పోస్టులు సంచలనంగా మారాయి.

ఈ వివాదంలో బాగంగా విజయ్ దేవరకొండ అభిమానులు తనని ఆంటీ అంటూ భారీ స్థాయిలో ట్రోల్ చేశారు. ఇలా ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది. అనసూయ ఈ వివాదానికి ఇకపై పులిస్టాప్ పెట్టాలని భావించినట్లు తెలియజేశారు. అప్పటినుంచి వివాదాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి ఈమెను మరోసారి నేటిజన్స్ ఆంటీ వివాదంలోకి లాగారు.. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఒక నెటిజన్ పీఆర్ మాఫియా లేపుతుందని, ఆ తర్వాత అనసూయ ఆంటీని దింపుతారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ.. ఎందుకు అస్తమానం నన్ను ఈ వివాదంలోకి లాగుతారు ఎవరు మాఫియా చేస్తున్నారో నేను ముందే చెప్పాను అయినా నేనే ఈ విషయంలో బాగా హైప్ చేస్తున్నానని మా వాళ్ళు అనడంతో వెనక్కి తగ్గాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే నాకు సింపతి అవసరం లేదు నాకు నాపైన దేవుడు పైన నమ్మకం ఉంది మా అమ్మ నాన్నలు విలువలతో నన్ను పెంచారని తెలిపారు.

ఇప్పుడు ఈ ట్వీట్ ని కూడా తమ స్వార్ధానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను.. కానీ నాకు ఇప్పుడు నేను కాదు లేదు..అన్నట్టు.. నాకు తెలిసి మీరు నేను చుట్టాలం అస్సలు కాదండి. కాబట్టి నేను మీకు ఆంటీ కానేమో అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈట్వీట్ మరోసారి సంచలనంగా మారింది.

Read More: రెండో పెళ్లి కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాము.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు