November 30, 2021
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `భోళా శంకర్`. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. రామెజీఫిలిం సిటీలో ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ వేసిన భారీ సెట్లో కొంత టాకీ పార్ట్, ఒక యాక్షన్ సీక్వెన్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫిలో తమన్నా చిరంజీవి పై ఒక సాంగ్‌ను చిత్రీకరించాడట మెహర్ రమేష్. 2015లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్. మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. భావోద్వేగాల ప్రధానాంశంగా ఈ సినిమా సాగుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్,క్రియేటివ్ కమర్షియల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2022 వేసవిలో రిలీజయ్యే అవకాశం ఉంది.