సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ మూవీలో ‘బేబి’ హీరోయినా?.. వైష్ణవికి ఇది పెద్ద ఆఫరే?

January 5, 2024

సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ మూవీలో ‘బేబి’ హీరోయినా?.. వైష్ణవికి ఇది పెద్ద ఆఫరే?

టాలీవుడ్ యంగ్ సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాలు కూడా అన్ని వరుసగా హిట్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు సిద్దుతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ ఉన్నారు. డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్న సిద్దు బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు.

రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే అంచనాలు పెరిగాయి. వీరిద్దిరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం సిద్దు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య ను ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో వైష్ణవి చైతన్యకు సంబంధించిన లుక్ ని విడుదల చేస్తూ హ్యాపీ బర్త్డే వైష్ణవి చైతన్య అని రాసుకొచ్చారు. వైష్ణవి ఫోటో కింద SVCC 37 అని రాసుకురావడంతో సిద్దు పక్కన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది అంటూ వార్తలు కూడా మొదలయ్యాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వైష్ణవి చైతన్యకు ఇది పెద్ద ఆఫరే అని చెప్పవచ్చు.

Read More: హ్యాపీ బర్త్ డే మామ.. అనుపమ పోస్ట్‌పై అభిమానుల కామెంట్లు!

ట్రెండింగ్ వార్తలు