హ్యాపీ బర్త్ డే మామ.. అనుపమ పోస్ట్‌పై అభిమానుల కామెంట్లు!

January 5, 2024

హ్యాపీ బర్త్ డే మామ.. అనుపమ పోస్ట్‌పై అభిమానుల కామెంట్లు!

టాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం మళ్ళీ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

కాగా గత ఏడాది కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ ఈ రెండు సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత సినిమాలలో గ్లామర్ షో కి లిప్ లాక్ సీన్లు రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో ఆ హద్దులు అన్ని చెరిపేస్తూ నెటిజెన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లను బట్టి చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతోంది.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెరీర్ పరంగా అనుపమ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అభిమానులతో ముచ్చటించడంతోపాటు వారు అడిగే ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ ఒక వ్యక్తికి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారింది.

అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు అనుపమ వాళ్ళ మామ. వాళ్ల మామయ్యకు బర్తడే విషెస్ చెబుతూ హ్యాపీ బర్తడే మామ అని రాసుకొచ్చింది. ఇక ఆ పోస్ట్ పై నేటిజన్స్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తూ వాళ్లు కూడా హ్యాపీ బర్త్డే మామ అంటూ నవ్వుతున్న ఏమోజీలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: దయచేసి డబ్బు సాయం చేయండి.. వేడుకున్న ఉర్ఫీ జావెద్?

ట్రెండింగ్ వార్తలు