మూడు పాటలను పూర్తి చేసుకున్న RC 16..ఈ స్పీడ్ ఏంటి బాసు?

March 28, 2024

మూడు పాటలను పూర్తి చేసుకున్న RC 16..ఈ స్పీడ్ ఏంటి బాసు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. నటుడిగా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇకపోతే ఇటీవల రామ్ చరణ్ తన 16వ చిత్రంగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత కొద్ది రోజుల కిందట ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకేక్కుతున్నటువంటి ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోవాలని రామ్ చరణ్ సినిమాకు సంబంధించి బుచ్చిబాబు ఒక అప్డేట్ విడుదల చేశారు. మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు ఫైనల్ అయ్యాయని రెహమాన్ గారు ఎంతో అద్భుతంగా కంపోస్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా బుచ్చిబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని వారం రోజులు అయ్యింది అప్పుడే మూడు పాటలను పూర్తి చేసుకోవడం ఏంటి మరి ఇంత స్పీడ్ ఏంటి అంటూ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బుచ్చిబాబు సినిమా పూర్తి కాగానే రామ్ చరణ్ తన 17వ చిత్రంగా మైత్రి మూవీస్ వారి నిర్మాణంలోనే సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ విషయాన్ని కూడా చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read More: టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే టిల్లు కుమ్మేసేలా ఉన్నాడే?

ట్రెండింగ్ వార్తలు