టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే టిల్లు కుమ్మేసేలా ఉన్నాడే?

March 28, 2024

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే టిల్లు కుమ్మేసేలా ఉన్నాడే?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోగడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. మరికొన్ని గంటలలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ దూసుకుపోతోంది.

డిజె టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ భారీ స్థాయిలో సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ జొన్నలగడ్డ మధ్య బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది.

ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా కోసం తన బౌండరీస్ కూడా బ్రేక్ చేశారనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల విడుదలైనటువంటి ట్రైలర్ కనుక చూస్తే ఈసారి మాత్రం టిల్లు గాడు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హెడ్ కొట్టేలాగే ఉన్నారని తెలుస్తోంది. సినిమాలో సిద్దు, అనుపమ కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం పక్కా అని చెబుతున్నారు. ఈ ట్రైలర్‌లో రొమాన్స్‌తో పాటు కామెడీ ప్లస్ యాక్షన్ అదుర్స్ అనేలా ఉంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్‌ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ కుమ్మడం ఖాయమని ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలిసిపోతుంది. మరి మార్చ్ 29వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఎలా సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read More: మాళవిక మోహనన్ ఈయన కూతురా… ఈయన ఒక స్టార్ ఫోటోగ్రాఫర్!

ట్రెండింగ్ వార్తలు